'కల్కి'ఓ డిఫరెంట్ మూవీ .. హిట్ కొట్టడం ఖాయం: హీరో రాజశేఖర్
Advertisement
రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా 'కల్కి' సినిమా రూపొందింది. ఆదా శర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఈ నెల 28వ తేదీన విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, ఈ సినిమా ప్రమోషన్స్ లో రాజశేఖర్ బిజీ అయ్యారు.తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. 'కల్కి' ఒక డిఫరెంట్ మూవీ .. ఈ సినిమాలో నేను 'కల్కి' పాత్రలో కనిపిస్తాను. దశావతారాల్లో ఒకటైన 'కల్కి' అవతారానికి నా పాత్రకి లింక్ చేస్తూ ఈ కథను ప్రశాంత్ వర్మ అద్భుతంగా నడిపించాడు. విస్తృతమైన పరిథి కలిగిన ఈ కథను .. రెండు గంటల్లో ప్రశాంత్ వర్మ చాలా బాగా చెప్పాడు. ఈ సినిమా అవుట్ పుట్ చూసి నిర్మాత సి.కల్యాణ్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకం వుంది" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 
Mon, Jun 24, 2019, 02:50 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View