'సిందుబాద్' సినిమా గురించి స్పందించిన అంజలి
Advertisement
 తమిళంలో విజయ్ సేతుపతి కథానాయకుడిగా 'సిందుబాద్' నిర్మితమైంది. ఈ నెల 21వ తేదీనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావలసి వుంది. అయితే కొన్ని కారణాల వలన విడుదల ఆగింది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి అంజలి స్పందించింది.

"విజయ్ సేతుపతితో కలిసి గతంలో ఒక సినిమా చేశాను. ఆయనతో నాకు ఇది రెండవ సినిమా. ఈ సినిమాలో ఒక గ్యాంగ్ నన్ను కిడ్నాప్ చేస్తుంది. ఆ గ్యాంగ్ బారి నుంచి ఆయన నన్ను ఎలా కాపాడాడనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఇది తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం వుంది. ప్రస్తుతం తెలుగులో రెండు .. తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాననీ .. రాజకీయాల్లో చేరనున్నానని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఈ రెండు వార్తల్లోను నిజం లేదు" అని ఆమె స్పష్టం చేసింది. 
Mon, Jun 24, 2019, 12:15 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View