యాంకర్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన రానా.. ప్రశంసల జల్లు కురిపిస్తున్న నెటిజన్లు
Advertisement
ఓ యాంకర్‌కు రానా దగ్గుబాటి దిమ్మ తిరిగే సమాధానం చెప్పి ఔరా అనిపించుకున్నాడు. ‘బాహుబలి’తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న రానా టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. ఇటీవల ఆయన ఓ వెబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. దీనిలో భాగంగా యాంకర్ దక్షిణాది చిత్ర పరిశ్రమను చులకన చేసి మాట్లాడటంతో ఆమె వ్యాఖ్యలు రానాకు ఆగ్రహం తెప్పించాయి. దీంతో యాంకర్‌కు గట్టిగా సమాధానం చెప్పాడు. చుట్టు పక్కల రాష్ట్రాల గురించి భారతీయులు తెలుసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని రానా పేర్కొన్నాడు.

చిత్ర పరిశ్రమలు దేనికవే సాటి అని తెలిపాడు. సినిమా తీసే విధానం ఒకటే, కెమెరా, కథ, నటీనటుల బృందం కూడా ఒకేలా ఉంటుందన్నాడు. తెలుగు చిత్ర సీమలో సినిమాలు తీసినట్టే తమిళంలోనూ తీస్తారని... పరిధిని దాటి సినిమాలు తీస్తున్న వారు కూడా ఉన్నారన్నాడు. రజనీకాంత్ సినిమాలు అలాగే అవెంజర్స్ సినిమా అన్ని భాషల్లోనూ డబ్ అయిందన్నాడు. మనం ఏర్పరిచే వరకూ దేనికీ హద్దులుండవనే విషయాన్ని గుర్తించాలని రానా పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో నెటిజన్లు రానాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Sun, Jun 23, 2019, 05:48 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View