ఇన్ స్టాగ్రామ్ లో హాట్ ఫొటోలను పోస్ట్ చేసిన రాశీ ఖన్నా!
- తక్కువ సినిమాలతోనే మంచి పేరు
- ఇప్పుడు అవకాశాలు తగ్గిన స్థితిలో రాశీ ఖన్నా
- వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫొటోలు
Advertisement
చేసింది తక్కువ సినిమాల్లోనే అయినా, మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన రాశీ ఖన్నా, ఇప్పుడు అవకాశాలు లేక గ్లామర్ ను అశ్రయించినట్టుంది. తన నటనకు అవకాశమున్న పాత్రలను అందిపుచ్చుకున్నా, అవి ఆమె కెరీర్ కు ఉపయోగపడలేదు. రెండు మూడేళ్ల క్రితం వరుసగా యంగ్ హీరోలతో సినిమా చాన్స్ లను కొట్టేసిన ఈ భామకు, ఇప్పుడు టాలీవుడ్ లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. తమిళంలో కాస్తంత ఫర్వాలేదని పించే స్థాయిలోనే అవకాశాలు ఉన్నా, మరిన్ని భాషల్లో నటించాలన్న ఆశతో ఉన్న ఈ బ్యూటీ, తన అందచందాలతో ఆకర్షించే పనిలో పడింది. గ్లామరస్ గా ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పెడుతోంది.
ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాశీ ఖన్నా ఇన్ స్టాగ్రామ్ ఖాతా ఇప్పుడు ఇలాంటి ఫొటోలతోనే కనిపిస్తోందట. ఇక ఈ ఫొటోలైనా ఆమెకు మరిన్ని అవకాశాలను దగ్గర చేస్తాయో లేదో వేచి చూడాల్సిందే.

Sun, Jun 23, 2019, 08:42 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com