కొంతమంది నాపై ఎన్టీఆర్ కి లేనిపోనివి కల్పించి చెప్పారు: కైకాల సత్యనారాయణ
Advertisement
సాంఘిక .. చారిత్రక .. పౌరాణిక .. జానపద చిత్రాల్లో కైకాల సత్యనారాయణ ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించారు. ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ," నా కెరియర్ తొలినాళ్లలో ఎన్టీఆర్ గారు నన్నెంతగానో ఆదరించారు. నాపై నమ్మకంతో బలమైన పాత్రలను ఇచ్చారు. ఫలానా పాత్ర కైకాల బాగా చేస్తారు అని నాకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు .. ఒక తమ్ముడిగా చూసుకునేవారు.

అలాంటి మా ఇద్దరి మధ్య కూడా మనస్పర్థలు తీసుకురావడానికి కొంతమంది ప్రయత్నించారు. నా గురించి వాళ్లు చెప్పిన మాటలు నిజమనుకుని ఎన్టీఆర్ గారు మనసు కష్టపెట్టుకున్నారు. ఆ విషయం తెలిసి నేను ఆయనను కలిసి, నా గురించి ఆయన విన్నదాంట్లో ఎంతమాత్రం నిజం లేదని చెప్పాను. నా గురించి కల్పించి చెప్పిన వ్యక్తులను పిలిపించి, వాళ్లు మాట మార్చడంతో అసలు విషయం తెలుసుకున్నారు. ఆ సందర్భంలో నాకు 'సారీ' చెప్పిన గొప్ప మనసు ఎన్టీఆర్ గారి సొంతం" అని చెప్పుకొచ్చారు.
Sat, Jun 22, 2019, 05:43 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View