యాక్షన్ కామెడీగా 'జై సేన'.. టీజర్ రిలీజ్
Advertisement
దర్శకుడు వి.సముద్ర యాక్షన్ సినిమాలను ఎక్కువగా తెరకెక్కించాడు. ఆయన నుంచి మరో యాక్షన్ మూవీ రానుంది. అయితే ఈ సారి ఆయన యాక్షన్ కి కాస్తంత కామెడీని జోడించనున్నాడు. ఈ కారణంగానే ఈ సినిమాలో సునీల్ ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాడు.

ఈ సినిమాకి 'జై సేన' అనే టైటిల్ ను ఖరారు చేసేసి, ఓ టీజర్ ను వదిలారు. హీరో గోపీచంద్ చేతుల మీదుగా ఈ టీజర్ ను రిలీజ్ చేయించారు. పోలీస్ ఆఫీసర్ 'దేవదాస్' గా సునీల్ పాత్రను పరిచయం చేస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు. కామెడీ సీన్స్ పైనే ఈ టీజర్ ను నడిపించారు. గతంలో చైల్డ్ ఆర్టిస్టులుగా కొన్ని సినిమాల్లో కనిపించిన ఓ నలుగురు కుర్రాళ్లు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.
Sat, Jun 22, 2019, 04:49 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View