'దొరసాని' టెన్షన్ తగ్గిందట!
Advertisement
రాజశేఖర్ కూతురు శివాత్మిక ప్రధాన పాత్రధారిగా దర్శకుడు కేవీఆర్ మహేంద్ర 'దొరసాని' సినిమాను రూపొందించాడు. శివాత్మిక జోడీగా ఆనంద్ దేవరకొండ కనిపించనున్నాడు. ఈ ఇద్దరూ ఈ సినిమా ద్వారానే తెలుగు తెరకి పరిచయమవుతున్నారు. తెలంగాణలోని ఓ 'గడీ'కి చెందిన అమ్మాయిని, ఓ సాధారణ యువకుడు ప్రేమించడం, దాని పర్యవసానాలతో ఈ కథ నడుస్తుంది.

ఈ సినిమాను వచ్చేనెల 12వ తేదీన విడుదల చేయనున్నారు. అదే రోజున 'ఇస్మార్ట్ శంకర్' ఉండటంతో, 'దొరసాని' టీమ్ టెన్షన్ పడింది. ఎందుకంటే పూరి - రామ్ కాంబినేషన్ కి గల క్రేజ్ వేరు. అయితే తాజాగా ఈ సినిమా వచ్చేనెల 18వ తేదీకి విడుదలను వాయిదా వేసుకుంది. దాంతో 'దొరసాని' టీమ్ హ్యాపీగా ఫీలవుతోందని సమాచారం. 'దొరసాని' రోజునే సందీప్ కిషన్ 'నిను వీడని నీడను నేనే' ఉన్నప్పటికీ దాని జోనర్ వేరు.
Sat, Jun 22, 2019, 04:21 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View