నాకు నిరాడంబరంగా బతకడమే ఇష్టం: నటుడు కైకాల సత్యనారాయణ
Advertisement
తెలుగు తెరపై నవరసాలను అవలీలగా పండించి అదరహో అనిపించిన కైకాల సత్యనారాయణ, ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. "తెలుగు సినిమా నన్నెంతగానో ఆదరించింది. సంపాదించి .. లేదు అనకూడదు. నేను బాగానే సంపాదించాను .. నా పిల్లలను చదివించాను .. వాళ్లకి ఆస్తులు పంచిచ్చాను.

నేను ఏదో సాధించాననీ .. సంపాదించేశానని గొప్పలకు పోవడం నాకు ఇష్టం వుండదు. సంతృప్తికి మించిన సంపదలేదని నేను భావిస్తాను. అందుకే ఆడంబరాలకు దూరంగా నా జీవితం సాగుతోంది. పిల్లలకి ఎక్కువ ఆస్తులు ఇచ్చేయడం వలన .. కష్టపడవలసిన అవసరం మనకేముంది? అనుకుంటారు. అందువలన ఏదైనా సాధించాలనే పట్టుదల .. కసి వాళ్లలో లేకుండా పోతుంది. జీవితంలో పైకొచ్చిన వాళ్లంతా కష్టపడినవాళ్లేననే సత్యం పిల్లలకి తెలిసేలా చేయాలి" అని చెప్పుకొచ్చారు. 
Sat, Jun 22, 2019, 03:54 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View