మల్లికార్జునరావుతో అక్కడే పరిచయమైంది: ఎల్బీ శ్రీరామ్
Advertisement
తెలుగు తెరపై రచయితగాను .. నటుడిగాను ఎల్బీ శ్రీరామ్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ హాస్య నటుడు మల్లికార్జునరావు గురించి ప్రస్తావించారు. "చెన్నైలో 'గంగానగర్'లో సినిమావాళ్లు ఎక్కువగా ఉండేవారు. జంధ్యాల గారు .. ఈవీవీ గారు .. గీతాకృష్ణ .. మల్లికార్జునరావు .. ఇలా చాలామంది ఉండేవారు.

గీతాకృష్ణ దగ్గరికి మల్లికార్జునరావు తరచూ వచ్చి కబుర్లు చెబుతుండేవాడు. విద్యాసాగర్ ద్వారా నాకు గీతాకృష్ణ .. ఆయన ద్వారా మల్లికార్జునరావు పరిచయమయ్యారు. ఆ తరువాత నేను .. మల్లికార్జునరావు మంచి స్నేహితులమయ్యాం. నేను రచయితగా చేసిన సినిమాల్లోను .. నటుడిగా చేసిన సినిమాల్లోనూ మల్లికార్జునరావు నటించాడు. ఆ రోజుల్లో అవకాశాల కోసం తిరిగినా, అవి అందమైన జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి" అని చెప్పుకొచ్చారు.
Sat, Jun 22, 2019, 02:26 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View