'సైరా'పై ప్రత్యేక శ్రద్ధ పెడుతోన్న చిరంజీవి
Advertisement
చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' నిర్మితమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి నిర్మాతగా ఇప్పటివరకూ చరణ్ అన్ని వ్యవహారాలు చూస్తూ వచ్చాడు.

అయితే 'ఆర్ఆర్ ఆర్' సినిమా కోసం త్వరలో ఆయన మహారాష్ట్ర వెళ్లనున్నాడు. దాదాపు నెలన్నర పాటు అక్కడ షూటింగు జరగనుంది. అందువలన 'సైరా'కి సంబంధించిన నిర్మాణ వ్యవహారాలను కూడా చూసుకోవలసిన బాధ్యతను చిరంజీవికే చరణ్ అప్పగించినట్టుగా చెబుతున్నారు. అవసరమైనప్పుడు తగిన సహకారాన్ని అందించమని నాగబాబుకు కూడా చరణ్ ఒక మాట చెప్పాడని అంటున్నారు. దాంతో ఈ ప్రాజెక్టు విషయంలో చిరూ మరింత దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. 
Sat, Jun 22, 2019, 12:26 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View