'కబీర్ సింగ్' తొలిరోజు వసూళ్లు
Advertisement
తెలుగులో ఆ మధ్య వచ్చిన 'అర్జున్ రెడ్డి' సంచలన విజయాన్ని నమోదు చేసింది. దర్శకుడిగా ఈ సినిమా సందీప్ రెడ్డి వంగా సత్తాను చాటి చెప్పింది. అటు హీరో .. ఇటు దర్శకుల కెరియర్లో ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచిపోయింది. అలాంటి ఈ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా 'కబీర్ సింగ్' పేరుతో సందీప్ రెడ్డి వంగా రీమేక్ చేశాడు.

నిన్న థియేటర్లకు వచ్చిన ఈ సినిమాకి, విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. షాహిద్ కపూర్ నటన అదుర్స్ అనేస్తున్నారు. అంతా అనుకున్నట్టుగానే భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. తొలి రోజున ఈ సినిమా 20 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇంతకుముందు షాహిద్ కపూర్ చేసిన 'పద్మావత్' సినిమా తొలిరోజున 18.21 కోట్లను వసూలు చేయగా, 'కబీర్ సింగ్' ఆ రికార్డును అధిగమించడం విశేషం.
Sat, Jun 22, 2019, 11:58 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View