'వాల్మీకి' నుంచి రానున్న ప్రీ టీజర్
Advertisement
వరుణ్ తేజ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ 'వాల్మీకి' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ప్రీ టీజర్ ను వదలడానికి రంగాన్ని సిద్ధం చేశారు. ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల 18 నిమిషాలకి ముహూర్తాన్ని ఖరారు చేశారు.

14 రీల్స్ ప్లస్ నిర్మాతలు నిర్మిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికి కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులను ఆగస్టునాటికి పూర్తిచేసి, సెప్టెంబర్ 6వ తేదీన విడుదల చేయనున్నారు. గతంలో తమిళంలో వచ్చిన 'జిగర్తాండ'కి ఇది రీమేక్. ఆ సినిమాలో బాబీ సింహా చేసిన పాత్రను తెలుగులో వరుణ్ తేజ్ చేస్తుండగా, సిద్ధార్థ్ చేసిన పాత్రలో అధర్వ మురళి కనిపించనున్నాడు.
Sat, Jun 22, 2019, 10:57 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View