సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  తమిళ చిత్ర కథానాయకుడు సూర్య సరసన నయనతార కథానాయికగా నటించే అవకాశం కనిపిస్తోంది. శివ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో నయనతారను తీసుకోమని సూర్య చెప్పడంతో ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట.
*  సంపత్ నంది దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ ఓ చిత్రం చేయనున్నాడు. సంపత్ చెప్పిన కథ నచ్చడంతో ఆ ప్రాజక్టుకి ఓకే చెప్పాడట. ప్రస్తుతం తాను చేస్తున్న చిత్రాలు పూర్తయ్యాక ఇది మొదలవుతుంది.
*  హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న 'వాల్మీకి' చిత్రం షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. కాగా, వచ్చే వారం ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేస్తారు. ఇందులో పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటిస్తోంది.
Sat, Jun 22, 2019, 07:25 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View