‘అరుంధతి 2’లో హీరోయిన్‌గా పాయల్ రాజ్‌పుత్.. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ దగ్గర శిక్షణ
Advertisement
కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అరుంధతి’. అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ హారర్ చిత్రానికి సీక్వెల్ సిద్ధమవుతోంది. శ్రీ శంఖు చిక్ర ఫిల్మ్స్ పతాకంపై కోటి తూముల ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అయితే అరుంధతిలో అనుష్క పాత్రను ‘ఆర్ఎక్స్ 100’ కథానాయిక పాయల్ రాజ్‌పుత్ పోషిస్తోంది.

ఈ చిత్రం కోసం పాయల్ హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వద్ద శిక్షణ తీసుకుంటోందని కోటి తెలిపారు. పాయల్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్‌కి చెందిన ప్రముఖ తారలు నటిస్తున్నారని వెల్లడించారు. భారీ బడ్జెట్, గ్రాఫిక్స్‌తో ఆ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు కోటి తెలిపారు. ఈ సినిమా కోసం పాయల్ గుర్రపు స్వారీ, కత్తి సాములకు హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వద్ద శిక్షణ తీసుకుంటోందని తెలిపారు. హాలీవుడ్ సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ విజువలైజేషన్ గ్రాఫికల్ వర్క్స్ జరుగుతోందన్నారు.
Fri, Jun 21, 2019, 06:26 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View