కాపీ వివాదంలో 'కల్కి' సినిమా
Advertisement
'గరుడ వేగ' హిట్ తరువాత రాజశేఖర్ కాస్త గ్యాప్ తీసుకుని 'కల్కి' సినిమా చేశాడు. ఆయన అభిమానులంతా ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఈ నెల 28వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కాపీ వివాదంలో చిక్కుకుంది.

కార్తికేయ అలియాస్ ప్రసాద్ అనే రచయిత ఈ కథ తనదేనని చెబుతున్నాడు. 'మహంకాళి' సినిమా సమయంలో నేను రాజశేఖర్ కి 'కల్కి' టైటిల్ తో కథ చెప్పాను .. స్క్రిప్ట్ కూడా ఇచ్చేశాను. ఈ ప్రాజెక్టుకి బడ్జెట్ ఎక్కువవుతుంది .. ఇప్పుడు అంత పెట్టలేం' అని రాజశేఖర్ అన్నారు. దాంతో నేను వేరే ప్రయత్నాల్లో ఉండిపోయాను. ఇప్పుడు అదే కథకి కొన్ని మార్పులు చేసి తీశారు. ఈ విషయంపై రైటర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేశాను. అసోసియేషన్ కమిటీ సభ్యులు 'కల్కి' యూనిట్ ను చర్చలకు పిలిస్తే రావడం లేదు. 'కల్కి' యూనిట్ నుంచి నేను డబ్బులు ఆశించడం లేదు .. క్రెడిట్ ఇస్తే చాలు" అని చెప్పుకొచ్చారు.
Fri, Jun 21, 2019, 04:54 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View