'విరాటపర్వం'లో నక్సలైట్ గా రానా
Advertisement
రానా కథానాయకుడిగా వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమాను లాంచ్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమాలో రానా సరసన నాయికగా సాయిపల్లవి కనిపించనుంది. టైటిల్ తోనే ఆసక్తిని రేకెత్తించడంలో దర్శకనిర్మాతలు సక్సెస్ అయ్యారు.

ఈ సినిమాలో రానా .. సాయిపల్లవి పాత్రలు ఎలా వుంటాయనే ఆసక్తి కూడా అభిమానుల్లో పెరిగిపోతోంది. ఈ సినిమాలో నక్సలైట్ పాత్రలో రానా కనిపించనున్నాడనీ .. జర్నలిస్ట్ పాత్రలో సాయిపల్లవి కనిపించనుందని అంటున్నారు. నక్సలైట్ గా అజ్ఞాతంలో వున్న రానాను జర్నలిస్ట్ గా ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లిన సాయిపల్లవి ఆయన ప్రేమలో పడుతుందట. ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలు ఉత్కంఠభరితంగా వుంటాయని చెబుతున్నారు.
Fri, Jun 21, 2019, 04:04 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View