కథా చర్చలు ఖరీదైన హోటల్స్ లో అవసరం లేదు : దర్శకుడు రేలంగి నరసింహారావు
Advertisement
దర్శకుడిగా ఎన్నో విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించిన అనుభవం రేలంగి నరసింహారావు సొంతం. అలాంటి ఆయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కెరియర్ పరంగా తనకి ఎదురైన కొన్ని అనుభవాలను గురించి ప్రస్తావించారు. "నేను చేసిన సినిమాలన్నీ లోబడ్జెట్ లో చేసినవే. అయినా అవి విజయవంతమయ్యాయి .. నిర్మాతలకి లాభాలు తెచ్చిపెట్టాయి.

ఇప్పుడు అనవసరంగా బడ్జెట్ పెంచేస్తున్నారు. కథా చర్చలు అంటూ ఖరీదైన హోటల్స్ లో 3 నెలల నుంచి 6 నెలల వరకూ సిటింగ్ వేస్తున్నారు. ఈ కారణంగా నిర్మాతకి ఏ స్థాయిలో ఖర్చు పెరిగిపోతుందో ఒకసారి ఆలోచించాలి. ప్రశాంతమైన వాతావరణం కోసం, ఏ మేడ మీద గదిలో కూర్చుని ఆలోచన చేసినా సరిపోతుంది. బుర్రపెట్టి ఆలోచించవలసిన పనికి ఖరీదైన హోటల్స్ లో సిటింగ్స్ ఎందుకు?' అంటూ ఆయన తన మనసులోని మాటను చెప్పారు.
Thu, Jun 20, 2019, 05:55 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View