రాధికతో కలిసి నటించాలంటే ఇప్పటికీ భయమే: నిరోషా
Advertisement
తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగిన నిన్నటితరం కథానాయికలలో రాధిక ఒకరు. ఆమె చెల్లెలు నిరోషా కూడా అప్పట్లో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. " మొదటి నుంచి కూడా రాధిక కొంచెం స్ట్రిక్ట్ గానే ఉండేది. నాకు సంబంధించిన ప్రతి విషయంలోను కేర్ తీసుకునేది.

ఆమెతో కలిసి సినిమాలు చేసేటప్పుడు సరిగ్గా చేయకపోతే సెట్లోనే తిట్టేసేది. అందువలన ఆ తరువాత ఆమెతో కలిసి సీరియల్స్ లో నటించడానికి కూడా భయపడ్డాను. ఆమెతో కలిసి చేయాలంటే ఇప్పటికీ భయమే. తాను ఏదైతే చేయాలనుకుంటుందో అది చేసి తీరుతుంది. ఒకసారి నాకు ముందుగా చెప్పకుండా తీసుకెళ్లి, అప్పటికప్పుడు నా ముక్కు కుట్టించేసింది. నేను లబోదిబో మన్నప్పటికీ వినిపించుకోలేదు" అంటూ నవ్వేసింది.
Thu, Jun 20, 2019, 03:35 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View