మొత్తానికి నితిన్ సినిమా పట్టాలెక్కేసింది
Advertisement
వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నితిన్ 'భీష్మ' సినిమా చేయనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ పాటికే ఈ సినిమా సెట్స్ పై వుండవలసి వుంది. కానీ కొన్ని కారణాల వలన పట్టాలెక్కడం ఆలస్యమైంది. ఈ రోజున ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ విషయాన్ని నితిన్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

ఈ ప్రేమకథా చిత్రంలో నితిన్ సరసన నాయికగా రష్మిక నటించనుంది. కొంతకాలంగా నితిన్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. కథపై నమ్మకంతో ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందని భావిస్తున్నాడు. ఇక నుంచి నితిన్ అభిమానులు ఈ సినిమాకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
Thu, Jun 20, 2019, 01:59 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View