250 కోట్లను రాబట్టిన సల్మాన్ 'భారత్'
Advertisement
సల్మాన్ ఖాన్ .. కత్రినా కైఫ్ జంటగా అలీ అబ్బాస్ జాఫర్ రూపొందించిన 'భారత్' .. ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేశ వ్యాప్తంగా 4700 థియేటర్స్ లో ఈ సినిమాను విడుదల చేశారు. తొలి ఆట నుంచే ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన ప్రతిచోటా ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోయింది.

అలా ఈ సినిమా ఇంతవరకూ 250 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇది సల్మాన్ కెరియర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన 6వ సినిమా కావడం విశేషం. ఈ సినిమా ఈ స్థాయి మార్కును టచ్ చేయడం గురించి సల్మాన్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఈ విజయానికి కారకులైన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. 
Thu, Jun 20, 2019, 12:12 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View