సంపూ 'కొబ్బరిమట్ట' విడుదల తేదీ ఖరారు
Advertisement
తెలుగు తెరపై హాస్యంతో సందడి చేసే నటుల్లో సంపూర్ణేశ్ బాబు ఒకరు. హాస్య కథానాయకుడిగా ఆయన చేసిన సినిమాల్లో 'కొబ్బరిమట్ట' ఒకటి. కొంతకాలం క్రితమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావలసింది. కానీ కొన్ని కారణాల వలన ఆలస్యమవుతూ వచ్చింది.

తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. జూలై 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మనోహర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా, తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో సంపూర్ణేశ్ బాబు వున్నాడు. ఈ సినిమా హిట్ అయితేనే ఆయన మళ్లీ బిజీ అవుతాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి. 
Thu, Jun 20, 2019, 11:17 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View