ఆసక్తిని రేపుతోన్న 'ఓ బేబీ' ట్రైలర్
Advertisement
నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రధారిగా 'ఓ బేబీ' రూపొందింది. సీనియర్ హీరోయిన్ లక్ష్మి .. రాజేంద్రప్రసాద్ కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, రావు రమేశ్ .. నాగశౌర్య ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

సమంత రూపంలో పడుచు వయసు .. లోపల వృద్ధురాలైన లక్ష్మి మనసు .. ఈ రెండింటి మధ్య జరిగే అల్లరిని అర్థం చేసుకోలేక బయటవాళ్లు పడే ఇబ్బందులతో ఈ ట్రైలర్ కొనసాగింది. సరదా సన్నివేశాలతో మొదలైన ట్రైలర్ .. ఎమోషన్ సీన్స్ తో పూర్తయింది. ముఖ్యమైన పాత్రల్లో బలమైన తారాగణమే ఉండటంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. వచ్చేనెల 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో సమంతకి మరో హిట్ పడటం ఖాయమనేది ఆమె అభిమానుల మాట.
Thu, Jun 20, 2019, 10:35 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View