రైల్వే పోలీసుపై విచక్షణా రహితంగా దాడి చేసిన ఇద్దరు యువకులు
Advertisement
రైల్వే పోలీసుపై ఇద్దరు యువకులు దాడికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని దేవ్‌రియా రైల్వే స్టేషన్‌లో జరిగింది. టికెట్ కౌంటర్ వద్ద ఇద్దరు యువకులు వరుసలో నిలబడకుండా టికెట్ కొనేందుకు యత్నించారు. దీనిని గమనించిన రైల్వే పోలీస్ క్యూలో వచ్చి టికెట్ తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో యువకులకు, రైల్వే పోలీసుకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సహనం కోల్పోయిన యువకులు పోలీసుపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని యువకులను అదుపులోకి తీసుకున్నారు.
Wed, Jun 19, 2019, 08:28 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View