‘కాళేశ్వరం’ ప్రారంభోత్సవానికి గవర్నర్ ను ఆహ్వానించిన సీఎం కేసీఆర్
Advertisement
రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ కొద్ది సేపటి క్రితం కలిశారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని నరసింహన్ ను కేసీఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆహ్వానపత్రికను ఆయనకు అందజేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ లు ముఖ్యఅతిథులుగా వస్తున్నట్టు నరసింహన్ కు చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణలో కొత్త సచివాలయం, అసెంబ్లీ ఏర్పాట్లపై నరసింహన్ కు కేసీఆర్ వివరించి చెప్పినట్టు సమాచారం. 
Wed, Jun 19, 2019, 07:17 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View