టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకుంటా: వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి
Advertisement
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు కొత్త చైర్మన్ గా వైసీపీ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని మీడియా పలకరించింది. సీఎం ఆదేశాల మేరకు టీటీడీ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నట్టు చెప్పారు. శనివారం మంచిరోజు అని తనకు సూచనలు, సలహాలు వచ్చాయని అన్నారు. కాగా, టీటీడీ బోర్డు కొత్తసభ్యులు కూడా అదేరోజున ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్టు సంబంధిత అధికారుల సమాచారం.
Wed, Jun 19, 2019, 06:32 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View