రైతులను ఇబ్బంది పెట్టే అధికారులను వదిలేది లేదు: ఆళ్ల రామకృష్ణారెడ్డి
Advertisement
Advertisement
ప్రభుత్వంతో మాట్లాడి రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేస్తామని, రైతులను ఇబ్బంది పెట్టిన అధికారులను వదిలేది లేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచ స్థాయి రాజధాని నగరం నిర్మిస్తామన్న చోట టీడీపీ ఎలా ఓటమి పాలైందని ప్రశ్నించారు. తామైతే రాజధానికి వ్యతిరేకం కాదని, దానిని మార్చేది లేదని అన్నారు. సీఎం జగన్‌ తాడేపల్లిలో ఇల్లు కట్టడానికి కారణం అమరావతి రాజధాని కావడమేనని ఆర్కే స్పష్టం చేశారు. గ్రామాల వారీగా సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.
Wed, Jun 19, 2019, 05:33 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View