దిల్ రాజుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్?
Advertisement
ప్రభాస్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'సాహో' సినిమాపైనే వుంది. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో పాటే ఆయన 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలోను ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి 'జాన్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత ఆయన మరో ప్రాజెక్టును కూడా లైన్లో పెట్టేసినట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.

ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజు అని అంటున్నారు. ఇటీవలే తన దగ్గరున్న ఒక కథను గురించి ప్రభాస్ కి దిల్ రాజు చెప్పడం .. చేద్దామని ఆయన అనడం జరిగిపోయాయట. ఆ కథను అద్భుతంగా తెరపై ఆవిష్కరించే దర్శకుడి కోసమే దిల్ రాజు అన్వేషణ సాగుతోందని చెబుతున్నారు. గతంలో ప్రభాస్ కి 'మున్నా' వంటి ఫ్లాప్ ఇచ్చిన దిల్ రాజు, ఆ తరువాత 'మిస్టర్ పెర్ఫెక్ట్' తో భారీ విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే.
Wed, Jun 19, 2019, 04:04 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View