మోహన్ లాల్ హిట్ మూవీకి సీక్వెల్
Advertisement
మోహన్ లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'లూసిఫెర్' భారీ విజయాన్ని సాధించింది. మోహన్ లాల్ కెరియర్లోనే చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా నిర్మాతలకు .. డిస్ట్రిబ్యూటర్లకు పెద్దమొత్తంలో లాభాలు తెచ్చిపెట్టడంతో, పృథ్వీరాజ్ సీక్వెల్ కి ప్లాన్ చేశాడు.

మోహన్ లాల్ కథానాయకుడిగా 'ఎంపురన్' టైటిల్ తో ఈ సీక్వెల్ రూపొందుతోంది. ముంబై మాఫియా డాన్ తో పోరాడే కథానాయకుడిగా ఈ సినిమాలో మోహన్ లాల్ కనిపించనున్నాడు. దర్శకుడు పృథ్వీరాజ్ కూడా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను చేస్తున్నట్టుగా సమాచారం. 'ఎంపురన్' విజయవంతమైతే, ఇదే సిరీస్ లో మరికొన్ని సినిమాలు చేసే ఆలోచనలో పృథ్వీరాజ్ వున్నాడట.
Wed, Jun 19, 2019, 03:16 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View