క్రైమ్ థ్రిల్లర్ గా 'అక్షర' .. టీజర్ రిలీజ్ డేట్
Advertisement
నందిత శ్వేత ప్రధాన పాత్రధారిగా 'అక్షర' సినిమా రూపొందింది. ఈ సినిమా ద్వారా బి. చిన్నికృష్ణ పరిచయమవుతున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ గా నిర్మితమైన ఈ సినిమాలో మధు నందన్ .. సత్య .. షకలక శంకర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.

తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను వదలనున్నారు. టీజర్ ను రేపు మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టుగా అధికారిక ప్రకటన చేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ కథను మలిచినట్టుగా మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ సంఘటనలు ప్రేక్షకులను ఎంతగా మెప్పిస్తాయో చూడాలి. సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని అందించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Wed, Jun 19, 2019, 01:30 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View