అల్లు అర్జున్ క్యారవాన్ ఖరీదు 7 కోట్లు!
Advertisement
అల్లు అర్జున్ తెరపైనే కాదు .. బయట కూడా తనదైన ప్రత్యేకతను కనబరుస్తుంటాడు. ఖరీదైన వాచ్ లు .. టీషర్టులు .. కార్ల విషయంలోను ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటాడు. ఇక అల్లు అర్జున్ 'క్యారవాన్' చూస్తే ఆయన అభిరుచి ఎలా ఉంటుందనేది అర్థమవుతుంది.

ఈ క్యారవాన్ 'పిక్' సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ క్యారవాన్ బ్లాక్ కలర్లో చాలా డీసెంట్ గా కనిపిస్తుంది. ఈ క్యారవాన్ పై 'A A' అనే అక్షరాలు రాసి ఉంటాయి. ఈ క్యారవాన్ ఖరీదు అక్షరాలా 7 కోట్ల రూపాయలట. ఇంటీరియర్ కోసమే 3.5 కోట్ల ఖర్చు చేశారని సమాచారం. విలాసవంతమైన సకల సౌకర్యాలు ఈ క్యారవాన్లో ఉన్నాయని అంటున్నారు. ఇంతటి లగ్జరీ క్యారవాన్ దేశంలో మరే హీరోకి లేదని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
Wed, Jun 19, 2019, 12:39 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View