ఆసక్తిని రేపుతోన్న 'ఆమె' టీజర్
Advertisement
తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా అమలా పాల్ కి మంచి క్రేజ్ వుంది. తెలుగులో గట్టి పోటీ ఉండటంతో, కొంతకాలంగా ఆమె తమిళ సినిమాలపైనే దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె తాజా చిత్రంగా తమిళంలో 'ఆడై' రూపొందుతోంది. రత్నకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి, విజ్జి సుబ్రహ్మణ్యం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమాను తెలుగులో 'ఆమె' పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా తెలుగు టీజర్ ను విడుదల చేశారు. వర్షం పడుతోన్న ఒక రాత్రివేళ ఒక స్త్రీ పోలీస్ స్టేషన్ కి వచ్చి తన కూతురు ఇంకా ఇంటికి రాలేదని ఫిర్యాదు చేయడంతో ఈ టీజర్ మొదలైంది. 'చివరిగా తను కాల్ చేసినప్పుడు తాగేసి వుంది సార్' అని ఆ తల్లి చెప్పడం విశేషం. అమలా పాల్ కెరియర్లో ఈ సినిమా ప్రత్యేకమనేది యూనిట్ సభ్యులు చెబుతోన్న మాట.
Wed, Jun 19, 2019, 10:25 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View