అందుకే నాగార్జున సైలెంట్ గా వున్నాడట
Advertisement
నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు 2' రూపొందుతోంది. రకుల్ .. కీర్తి సురేశ్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాలో, సీనియర్ హీరోయిన్ లక్ష్మి కీలకమైన పాత్రను పోషిస్తోంది. నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా నుంచి వచ్చేనెల ట్రైలర్ ను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఒక ఫ్రెంచ్ సినిమాకి రీమేక్ అనే టాక్ వచ్చింది. అయితే ఈ ప్రచారంపై నాగ్ ఎంత మాత్రం స్పందించలేదు. ఎందుకంటే ఆ ఫ్రెంచ్ సినిమా గురించి అంతా మాట్లాడుకోవడం .. ఆన్ లైన్ లో చూసేయడం చేస్తారు గనుక, ముందు జాగ్రత్తతోనే నాగ్ సైలెంట్ గా ఉండిపోయారని అంటున్నారు. ఆ ఫ్రెంచ్ సినిమా రీమేక్ రైట్స్ తీసుకునే నాగ్ నిర్మిస్తున్నట్టుగా సమాచారం. త్వరలోనే విడుదల తేదీని  ప్రకటించనున్నారు.
Wed, Jun 19, 2019, 10:00 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View