టీవీ నటి రాగ మాధురిపై దాడి!
Advertisement
ప్రముఖ టీవీ నటి రాగమాధురిపై ఆమె హెయిర్ డ్రెసర్ జ్యోతిక తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను హైదరాబాద్, బంజారా హిల్స్ పోలీసులు వివరించారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 13 లోని లక్ష్మీపార్వతి నివాసం వద్ద తెలుగు సీరియల్ షూటింగ్ జరుగుతోంది. ఆ సీరియల్ లో నటిస్తున్న రాగమాధురి నల్లపూసల గొలుసు రెండురోజుల క్రితం కనిపించకుండా పోయింది. ఈ విషయమై సెట్ లోని సభ్యులను ఆమె ఆరా తీసినప్పటికి ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. హెయిర్ డ్రెసర్ జ్యోతితో పాటు మరో ఇద్దరిపై అనుమానం వ్యక్తం చేస్తూ తన ఫిర్యాదులో పేర్కొంది.

ఈ ఫిర్యాదు మేరకు జ్యోతికను విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో పోయిన గొలుసు కారులో దొరికిందంటూ సెట్ లోని వారు ఆ గొలుసును పోలీసులకు అప్పగించి పోలీస్ స్టేషన్ నుంచి జ్యోతికను తీసుకెళ్లారు.ఈ ఘటనతో ఆగ్రహం చెందిన జ్యోతిక, తన అనుచరులు ఎనిమిది మందితో కలిసి షూటింగ్ జరుగుతున్న ప్రదేశం వద్దకు వెళ్లి రాగమాధురిపై దాడికి పాల్పడింది. తనపై దాడి నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీసులకు రాగమాధురి మరోమారు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు జ్యోతిక, ఆమె అనుచరులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Tue, Jun 18, 2019, 10:09 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View