టీ-కాంగ్రెస్ నేత వీహెచ్ పై కేసు నమోదు
Advertisement
హైదరాబాద్‌లోని పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ధర్నాకు దిగిన కాంగ్రెస్ నేత వీహెచ్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీహెచ్ పై కేసు నమోదు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించారని, పోలీసులతో అసభ్యకరంగా మాట్లాడారని ఆరోపిస్తూ ఆయనపై ఐపీసీ 143, 153ఏ, 353 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నాంపల్లి కోర్టులో ఆయన్ని హాజరుపరచనున్నారు. ఈ క్రమంలో ఉస్మానియా ఆసుపత్రిలో వీహెచ్ కు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వీహెచ్ కు బీపీ, షుగర్ లెవెల్స్ అధికంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.
Tue, Jun 18, 2019, 08:58 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View