'కౌసల్య కృష్ణమూర్తి' టీజర్ లాంచ్ చేసిన చిరంజీవి
Advertisement
క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన 'కౌసల్య కృష్ణమూర్తి' చిత్రం టీజర్ ను ఇవాళ మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ అధినేత కేఎస్ రామారావు, చిత్ర దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు సమక్షంలో చిరంజీవి ల్యాప్ టాప్ ద్వారా టీజర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రం ఘనవిజయం సాధించాలంటూ ఆకాంక్షించారు.

 కాగా, ఓ సాధారణ అమ్మాయి దేశం గర్వించేలా క్రికెట్ ఆటలో ఎలా ఎదిగిందన్న ఇతివృత్తంతో 'కౌసల్య కృష్ణమూర్తి' చిత్రాన్ని రూపొందించారు. తమిళంలో 'కణ' పేరుతో విడుదలైన చిత్రానికి రీమేక్ గా 'కౌసల్య కృష్ణమూర్తి' తెరకెక్కిస్తున్నారు. తమిళ మాతృకలో ప్రధాన పాత్ర పోషించిన ఐశ్వర్య రాజేశ్ తెలుగు చిత్రంలోనూ లీడ్ రోల్ చేస్తోంది. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్, కార్తీక్ రాజు ఇతర ముఖ్య తారాగణం.
Tue, Jun 18, 2019, 05:24 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View