'ఓటర్' మూవీ నుంచి సాంగ్ రిలీజ్
Advertisement
మంచు విష్ణు కథానాయకుడిగా జిఎస్ కార్తీక్ దర్శకత్వంలో 'ఓటర్' సినిమా రూపొందింది. సురభి కథానాయికగా నటించిన ఈ సినిమాను ఈ నెల 21వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగును రిలీజ్ చేశారు. మంచు విష్ణు .. సురభిపై చిత్రీకరించిన బీచ్ సాంగ్ ఇది.

సురభి అందాలను ఆరబోసిన ఈ సాంగ్ ను కలర్ ఫుల్ గా ఆవిష్కరించారు. తమన్ స్వరపరిచిన ఈ పాట మనసుకు హత్తుకునేలా వుంది. సుధీర్ పూదోట నిర్మించిన ఈ సినిమా, రాజకీయాల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కొంతకాలంగా హిట్ కోసం వెయిట్ చేస్తోన్న విష్ణు, ఈ సినిమాతో తన నిరీక్షణ ఫలిస్తుందని భావిస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.
Tue, Jun 18, 2019, 05:20 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View