నా సినిమాల్లో నా పిల్లలకు అవే ఇష్టం: మహేశ్ బాబు
Advertisement
మహేశ్ బాబు తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. ఒక వైపున తన సినిమాలకి ప్రాముఖ్యతనిస్తూనే, మరో వైపున ఫ్యామిలీతో కలిసి సరదాగా గడుపుతుంటాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "ఒకసారి స్క్రిప్ట్ ను ఓకే చేశాక నేను దాని విషయంలో జోక్యం చేసుకోను .. దర్శకుడి పనిలో కల్పించుకోను.

నా సినిమాల విషయంలో బెస్ట్ క్రిటిక్ నమ్రతనే. సినిమా ఎలా ఉందనేది ఆమె కరెక్ట్ గా చెప్పేస్తుంది. ఇక నా పిల్లలు గౌతమ్ .. సితార ఇద్దరూ కూడా నా సినిమాలు తప్పకుండా చూస్తారు. ఇంతవరకూ నేను చేసిన సినిమాల్లో సితారకి 'శ్రీమంతుడు' అంటే చాలా ఇష్టం. ఇక గౌతమ్ కి 'అతడు' ఇష్టం. నిజం చెప్పాలంటే పిల్లలిద్దరినీ నేను గారం చేస్తాను .. కానీ నమ్రత మాత్రం వాళ్ల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.
Tue, Jun 18, 2019, 04:40 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View