రాజశేఖర్ నటన అదుర్స్ .. 'కల్కి' హిట్ కొట్టడం ఖాయం: కె.కె.రాధామోహన్
Advertisement
రాజశేఖర్ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి' .. ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదా శర్మ కథానాయికగా సి.కల్యాణ్ నిర్మించిన ఈ సినిమాను, కె.కె.రాధామోహన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

తాజాగా ఆయన మాట్లాడుతూ .. 'కల్కి' రిలీజ్ రైట్స్ ను నేను తీసుకుని మా బ్యానర్ పై డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. ఈ సినిమా కంటెంట్ చూసి డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేము ముందుకు వచ్చాము. రాజశేఖర్ కి సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనే పేరు వుంది. ఈ సినిమాలో ఆయన కామెడీ టైమింగ్ మరోసారి కట్టిపడేస్తుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాకి, విజువల్ ఎఫెక్ట్స్ .. సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోను క్రేజ్ వుంది. తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకం బలంగా వుంది" అని చెప్పుకొచ్చారు.
Tue, Jun 18, 2019, 03:11 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View