'జయం' హిట్ కావడంతో నన్ను చూడటానికి జనం విపరీతంగా వచ్చేవారు: కమెడియన్ సుమన్ శెట్టి
Advertisement
కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమన్ శెట్టి, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. "తెలుగులో నా తొలి సినిమా 'జయం' .. ఈ సినిమాలో నేను 'అలీబాబా' పాత్రను చేశాను. 'జయం' సూపర్ హిట్ కావడంతో నాకు మంచి గుర్తింపు వచ్చేసింది.

 నేను మా ఊరు వెళ్లిపోయి .. అంతకుముందులానే షాపులో మా నాన్నకి సాయంగా కూర్చున్నాను. అంతే నన్ను చూడటానికి ఊళ్లో వాళ్లు విపరీతంగా రావడం మొదలెట్టారు. దాంతో బిజినెస్ కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి, మా నాన్న నన్ను కొట్లొకి రావొద్దని చెప్పాడు. 'జయం' సినిమా ద్వారా వెండితెరకి పరిచయమైన నేను, తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో కలుపుకుని 350 సినిమాల వరకూ చేశాను" అని చెప్పుకొచ్చాడు.
Tue, Jun 18, 2019, 02:28 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View