బాధను మనసులో దాచుకుని కామెడీ సీన్ చేయాల్సి వచ్చింది: కమెడియన్ సుమన్ శెట్టి
Advertisement
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సుమన్ శెట్టి మాట్లాడుతూ, తనకి ఎదురైన ఒక సంఘటనను గురించి చెప్పుకొచ్చాడు. " సినిమా పేరు నాకు గుర్తుకు లేదు గానీ .. నేను ఒక కామెడీ సీన్ చేస్తున్నాను. అదే సమయంలో మా అమ్మమ్మ చనిపోయినట్టుగా కాల్ వచ్చింది. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. అయినా ఆ బాధను గుండెల్లోనే దాచుకుని ఆ కామెడీ సీన్ చేయవలసి వచ్చింది.

ఈ విషయం గుర్తొచ్చినప్పుడల్లా బాధపడుతూనే వుంటాను. ఇక నాకు కాస్త 'ఈగో' అనే టాక్ కూడా ఇండస్ట్రీలో వుంది. కానీ నిజానికి నాకు ఎలాంటి ఈగో లేదు. కొత్తవారితో నేను తొందరగా కలవలేను. తెలిసీ తెలియక ఏం మాట్లాడతానోననే భయం వుంటుంది. అందువల్లనే వాళ్లకి కాస్త దూరంగా వుంటాను. అందువలన నా గురించి అలా ప్రచారం జరుగుతోంది" అని చెప్పుకొచ్చాడు. 
Tue, Jun 18, 2019, 01:00 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View