డబ్బులేక చాలా ఇబ్బందులు పడిన రోజులున్నాయి: సమంత
Advertisement
తెలుగులో అగ్రకథానాయికల జాబితాలో సమంత చాలాకాలంగా కొనసాగుతోంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తనకి సంబంధించిన విషయాలను గురించి ప్రస్తావించింది. "మాది చాలా సాధారణమైన కుటుంబం. నేను సినిమాల్లో రావడానికి ముందు, డబ్బు తగినంతగా లేక చాలా ఇబ్బందులు పడుతుండేవాళ్లం. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎలా వుంటాయో తెలుసును గనుకనే, అలాంటి పరిస్థితుల్లో వున్న వారికి నేను సాయం చేస్తుంటాను.

కష్టాల్లో వున్నప్పుడు .. జీవితంలో ఒక సొంత ఇల్లు, బ్యాంకు అకౌంటులో 50 లక్షలు వుంటే చాలు అనుకునేదానిని. కానీ భగవంతుడు నేను అడిగిన దానికంటే ఎక్కువగానే ఇచ్చాడు. అందుకు ఆ దేవుడికి నేను సదా రుణపడి వుంటాను. ఏ సినిమా అయినా సరిగ్గా ఆడకపోతే అందుకు హీరోయిన్ ను బాధ్యురాలిగా చేసి ఐరెన్ లెగ్ ముద్ర వేసే తీరే నాకు బాధకలిగిస్తూ ఉంటుంది" అని చెప్పుకొచ్చింది.
Mon, Jun 17, 2019, 06:01 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View