'సాహో' కోసం రంగంలోకి జిబ్రాన్
Advertisement
ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో 'సాహో' రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా టాకీ పార్టును పూర్తి చేసుకుంది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి, సంగీత దర్శకులుగా శంకర్ ఎహసాన్ లాయ్ ను తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన, ఈ ప్రాజెక్టు నుంచి వాళ్లు తప్పుకున్నారు.

దాంతో నేపథ్య సంగీతం కోసం తమన్ నుగానీ .. జిబ్రాన్ ను గాని తీసుకునే అవకాశాలు వున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరి పేర్లను పరిశీలించిన టీమ్, చివరికి జిబ్రాన్ ను ఎంపిక చేసుకున్నట్టుగా సమాచారం. ఆల్రెడీ యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వచ్చిన రెండు మూడు సినిమాలకి జిబ్రాన్ పనిచేశాడు. 'సాహో' సినిమాలో పాటలకు మాత్రం ఇద్దరు ముగ్గురు బాలీవుడ్ దర్శకులతో ట్యూన్స్ చేయిస్తారట. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 
Mon, Jun 17, 2019, 05:27 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View