అందుకే చిరూతో ఎక్కువ సినిమాలు చేయలేదు: నిర్మాత సురేశ్ బాబు
Advertisement
సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామానాయడు ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఎన్నో భారీ సినిమాలను నిర్మించిన ఆయన మెగాస్టార్ చిరంజీవితో ఒక్క 'సంఘర్షణ' సినిమాను మాత్రమే తీశారు. తాజా ఇంటర్వ్యూలో అందుకు గల కారణాన్ని సురేశ్ బాబు చెప్పుకొచ్చారు.

అప్పట్లో చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉండేవారు. నాన్నకీ .. చిరంజీవిగారికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. కానీ మా బ్యానర్ పై ఒక సినిమా చేయమని అడిగితే, ఆరు నెలలు ఆగండి .. ఏడాది ఆగండి అంటారేమోననే ఒక ఆలోచన. ప్రొడక్షన్ విషయంలో నాన్న గ్యాప్ రాకుండా చూసేవారు. అందువలన స్టార్ హీరోల కోసం ఎదురుచూడకుండా ఆయన కథలను ఎక్కువగా నమ్మేవారు. అలా చేసిన సినిమాలు కూడా సక్సెస్ అయ్యాయి. 'ప్రతిధ్వని' .. 'ప్రేమఖైదీ'వంటి సినిమాలు అందుకు నిదర్శనం.
Mon, Jun 17, 2019, 04:12 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View