ఫ్లాప్ వస్తే దూరం పెడతారు .. హిట్టొస్తే వెంటపడతారు: కైరా అద్వాని
Advertisement
ఏ భాషా చిత్రపరిశ్రమలోనైనా ఎవరు సక్సెస్ లో వుంటే వారి చుట్టూనే అవకాశాలు తిరుగుతాయి. 'ఫ్లాప్ వస్తే రెగ్యులర్ గా మాట్లాడే దర్శక నిర్మాతలు కూడా కాల్ లిఫ్ట్ చేయరు' అని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో అభిషేక్ బచ్చన్ చెప్పారు. బిగ్ బి తనయుడి పరిస్థితి అలా వుంటే, ఇక మిగతావారి పరిస్థితిని గురించి చెప్పేదేవుంది.

అదే పరిస్థితి తనకి కూడా ఎదురైందని తాజాగా కైరా అద్వాని చెప్పింది. నా మొదటి సినిమా పరాజయం పాలైనప్పుడు, నన్ను చూస్తే పారిపోయారు. నాకు కనిపించకుండా ముఖం చాటేశారు. అలాంటి వాళ్లంతా నాకు సక్సెస్ వచ్చిన తరువాత వెంటపడుతున్నారు. అలాగని చెప్పేసి నేను ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోవడం లేదు. నాకు నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాను. అన్ని భారతీయ భాషల్లోను నటించాలనేది నా ఆశ" అని అంది.
Mon, Jun 17, 2019, 03:44 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View