హ్యాండ్సమ్ 'రాక్షసుడు'గా బెల్లంకొండ శ్రీనివాస్
Advertisement
బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా రమేశ్ వర్మ దర్శకత్వంలో 'రాక్షసుడు' రూపొందుతోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. వరుస హత్యలు చేసుకుంటూ వెళ్లే ఒక సైకోను పట్టుకునే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ మరింత హ్యాండ్సమ్ గా కనిపించనున్నాడనే విషయం ఈ స్టిల్స్ ను బట్టి తెలుస్తోంది. జిబ్రాన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. క్రితం ఏడాది చివర్లో తమిళంలో హిట్ కొట్టిన 'రాచ్చసన్'కి ఇది రీమేక్. ఆ సినిమా మాదిరిగానే ఇది కూడా హిట్ అవుతుందేమో చూడాలి.
Mon, Jun 17, 2019, 03:03 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View