శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూ - సాయిపల్లవి
Advertisement
ప్రస్తుతం శేఖర్ కమ్ముల ఒక విభిన్నమైన ప్రేమకథా చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. కొత్త హీరో హీరోయిన్లను ఆయన ఈ సినిమా ద్వారా పరిచయం చేయనున్నాడు. ఇప్పటికే కొంతవరకూ ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంది. హీరో హీరోయిన్లు డాన్స్ లో శిక్షణ తీసుకోవలసి ఉండటం వలన షూటింగుకు ఒక 3 నెలల పాటు గ్యాప్ ఇచ్చారు. ఈ గ్యాప్ లో ఆయన చైతూ - సాయిపల్లవి నాయకా నాయికలుగా ఒక ప్రాజెక్టును పట్టాలెక్కించే ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. ఇక గతంలో శేఖర్ కమ్ముల - సాయిపల్లవి కాంబినేషన్లో వచ్చిన 'ఫిదా' భారీ విజయాన్ని నమోదు చేయడంతో, సహజంగానే ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరిగే అవకాశం వుంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.
Mon, Jun 17, 2019, 01:17 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View