మూడు పాత్రల్లో కనిపించనున్న విజయ్ దేవరకొండ?
Advertisement
విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'డియర్ కామ్రేడ్' ముస్తాబవుతోంది. ఆ తరువాత సినిమాను ఆయన క్రాంతిమాధవ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో కార్మిక నాయకుడిగా .. ఎన్నారైగా రెండు పాత్రల్లో ఆయన కనిపించనున్నట్టుగా వార్తలు బయటికొచ్చేశాయి.

ఈ రెండు పాత్రల సరసన రాశి ఖన్నా - ఐశ్వర్య రాజేశ్ నాయికలుగా అలరించనున్నారు. మూడో పాత్రలో ఆయన రైటర్ గా కనిపించనున్నాడనేది తాజా సమాచారం. మూడు కథలను ప్రేక్షకులకు చెబుతూ, ఈ మూడు కథల్లోను తనే కథానాయకుడిగా కనిపించడం .. ఈ మూడు కథలకి ఒకదానితో ఒకదానికి సంబంధం ఉండటం విశేషమని చెబుతున్నారు. మూడవ కథానాయికగా ఎవరిని తీసుకుంటారో చూడాలి మరి.
Mon, Jun 17, 2019, 12:44 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View