మోహన్ బాబు ఓ లెజెండ్.. ఆయనతో పనిచేయడం నా అదృష్టం!: హీరో సూర్య
Advertisement
తమిళ హీరో సూర్య నటిస్తున్న ‘సూరారై పొట్రు’ సినిమాలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రను దక్కించుకున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మోహన్ బాబుపై హీరో సూర్య ప్రశంసల వర్షం కురిపించారు.

‘మోహన్ బాబు గారితో సెట్ లో కలిసి పనిచేయడం నిజంగా నా అదృష్టం. ఆయన గొప్ప క్రమశిక్షణతో ఉండే లెజెండ్. ఓ చిన్న గ్యారేజీలో నివాసమున్న స్థాయి నుంచి ఏకంగా 500కుపైగా సినిమాల్లో ఆయన నటించారు. సూరారై పొట్రు సినిమాలో భాగం అయినందుకు మోహన్ బాబు గారికి ధన్యవాదాలు’ అని సూర్య ట్వీట్ చేశారు.

దీంతో ట్విట్టర్ లో మోహన్ బాబు వెంటనే స్పందించారు. ‘ఈ జనరేషన్ లో టాప్ స్టార్ అయినప్పటికీ సూర్య సెట్ లో క్రమశిక్షణతో, హుందాగా ఉంటారు. మీ ప్రవర్తనే మీ క్యారెక్టర్ గురించి చెబుతుంది. తర్వాతి షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నాను యంగ్ ఫ్రెండ్’ అని ట్విట్టర్ లో జవాబిచ్చారు.

చౌక విమానయాన సంస్థ ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా ‘సూరరై పొట్రు’ను సుధా.కె. కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సూర్యకు చెందిన 2డీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మిస్తోంది.
Mon, Jun 17, 2019, 11:59 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View