ఆకట్టుకునే 'ఓటర్' ట్రైలర్
Advertisement
మంచు విష్ణు కథానాయకుడిగా జీఎస్ కార్తీక్ దర్శకత్వంలో 'ఓటర్' సినిమా రూపొందింది. సురభి కథానాయికగా నటించిన ఈ సినిమా, ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావలసింది. కానీ హీరోకి .. దర్శకుడికి మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఆలస్యమైంది.  ఓటు .. ప్రజాస్వామ్యంలో ఓటుకు వున్న విలువ .. ఓటర్లను చైతన్యవంతులను చేసే కథాకథనాలతో ఈ సినిమాను నిర్మించారు.

 తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది. రాజకీయాలలో మార్పును కోరుకునే ఒక 'ఓటర్' గా మంచు విష్ణు చెప్పే డైలాగ్స్ పవర్ ఫుల్ గా వున్నాయి. సంపత్ .. పోసాని కీలకమైన పాత్రలను పోషించినట్టుగా ఈ ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Mon, Jun 17, 2019, 11:21 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View