మమ్మల్ని ఇక్కడే తుంచేయెద్దు: హీరో సప్తగిరి
Advertisement
సప్తగిరి కథానాయకుడిగా దర్శకుడు అరుణ్ పవార్ తెరకెక్కించిన 'వజ్రకవచధర గోవింద' సినిమా ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో సప్తగిరి మార్క్ కామెడీ లేదనే టాక్ వచ్చింది. తాజాగా ఈ సినిమా టీమ్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది.

ఈ వేదికపై సప్తగిరి మాట్లాడుతూ .. "మా సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది. స్కూళ్లు తెరవడం వలన ఆ ప్రభావం వసూళ్లపై పడిందని భావిస్తున్నాము. బి - సి సెంటర్లలో సినిమా బాగానే ఆడుతున్నందుకు ఆనందంగా వుంది. సెకండాఫ్ సాగతీతగా ఉందనే రిపోర్ట్ వలన 10 నిమిషాల నిడివిని తగ్గించడం జరిగింది. మీరంతా ఈ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించాలి. ఇక్కడే మమ్మల్ని తుంచేస్తే ముందుకు వెళ్లలేం. మీరంతా సపోర్ట్ చేస్తారనే భావిస్తున్నాము" అని చెప్పుకొచ్చారు.
Mon, Jun 17, 2019, 10:58 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View